హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణ ఏది?
రోగులు లేని బెడ్లమీద బెడ్ షీట్లు ….. రోగులు ఉన్న బెడ్ల మీదనేమో బెడ్ షీట్లు కరువు?
ప్రభుత్వం మారిన పనితీరు మారని
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనం.
మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మారని ఆసుపత్రి సూపరింటెండెంట్ పనితీరు.
సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధం.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
గడిపె మల్లేశ్.
NSN NEWS// హుస్నాబాద్// SIDDIPET:
హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో రోగులకు సరైన వసతులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గడిపె మల్లేశ్ అన్నారు. శనివారం నాడు ఆయన ఆసుపత్రి సందర్శించి సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకుండా రోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి నిర్లక్ష్యం పనితీరుకు అద్దం పడుతుందని ఆసుపత్రిలో ఖాళీ బెడ్ల మీద బెడ్ షీట్లు పెట్టి రోగులు ఉన్నచోట బెడ్లమీద బెడ్ షీట్ వేయకుండా రోగులకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆసుపత్రికి వచ్చే పేషెంట్ అటెండెన్స్ కి కూర్చోడానికి స్టూల్స్ కూడా లేవని ఆసుపత్రికి సరిపడా ఫర్నిచర్,బెడ్ షీట్లు,ప్యాడ్లు వెంటనే సమకూర్చాలని అందుకు సరిపడా నిధులు మంజూరు కోసం తెలంగాణ రాష్ట్ర రావాణా ,బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కృషి చేయాలని ప్రజా రోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పైచర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు.