పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఈవీఎం మిషన్ల పంపిణీ..
జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి
NSN NEWS// సిద్దిపేట
:
లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల ప్రక్రియలో భాగంగా శనివారం కలెక్టరేట్ పక్కనగల ఎన్నికల ఈవీఎం గోడౌన్ లో జిల్లాలోని నలుగురు ఏఆర్వోలకు ఈవీఎం మిషన్ల పంపిణీ జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల గోడౌన్ లో భద్రపరిచిన ఇవిఏం మిషన్లను మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు మరియు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఏఆర్వోలకు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆధ్వర్యంలో సిద్దిపేట ఏఆర్వోకు 341 బ్యాలెన్సింగ్ యూనిట్లు, 341 కంట్రోల్ యూనిట్లు, 382 వివి ప్యాట్లను, దుబ్బాక ఏఆర్ఓ కు 316 బ్యాలెన్సింగ్ యూనిట్లను, 316 కంట్రోల్ యూనిట్లను, 354 వివి ప్యాట్ యంత్రాలను, గజ్వేల్ ఏఆర్ఓ కు 402 బ్యాలెన్స్సింగ్ యూనిట్లు, 402 కంట్రోల్ యూనిట్లు, 450 వివి ప్యాట్ యంత్రాలను, హుస్నాబాద్ ఏఆర్ ఓ కు 380 బ్యాలెన్సింగ్ యూనిట్లు, 380 కంట్రోల్ యూనిట్లు, 425 వివి ప్యాట్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ ఈవీఎం మిషన్లను పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు వరకు సంబంధిత ఏఆర్ఓల పరిధిలోని శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో గల స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి పోలింగ్లో ఉపయోగిస్తారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించేందుకు ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను మీ పరిధిలోని స్ట్రాంగ్ రూముల్లో జాగ్రత్తగా గట్టి బందోబస్తు మధ్య భద్రపరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ మరియు దుబ్బాక నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గరీమ అగర్వాల్, జిల్లా కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట గజ్వేల్ హుస్నాబాద్ ఏఆర్వోలు సదానందం, బన్సీలాల్, రామ్మూర్తి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.