Home జిల్లా వార్తలు అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం

0
అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం

NSN NEWS//సిద్దిపేట :

 

అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యంను సిద్దిపేట త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది త్రీ టౌన్ పోలీసులు వాహనంలో ఉన్న 41 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితుని పై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ
పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామాలలో,పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version