Nsnnews// వచ్చేనెల 9న కౌలాలంపూర్ లో జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు రావాలని.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్ కి కలిసి ఆహ్వానించారు. కేవలం మలేషియాలోని తెలంగాణ వాసులే కాకుండా… వివిధ దేశాల నుంచి తెలంగాణ ప్రముఖులు హాజరు కానున్నట్లు KTRకి తెలిపారు. దశాబ్ది వేడుకలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన KTR.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకి వెళ్లిన ప్రాంతీయులు రాష్ట్రం, ప్రజలపై అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మలేషియాలోని తెలంగాణ వాసులు తమకంటూ.. ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటుచేసి అనేక రకాల కార్యక్రమాల్లో మమేకం కావడంపై KTR అభినందనలు తెలిపారు. 10 ఏళ్ల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Politics