Nsnnews// హరియాణ కర్నాల్‌లోని నూర్ మహల్ ప్యాలెస్ హోటల్ వెలుపల వింటెజ్ కార్లు, ద్విచక్ర వాహనాలను ప్రదర్శించారు. 1930 దశకంనాటి కార్లు, వెస్పా స్కూటర్లు, 1960-70ల నాటి బుల్లెట్ బైకులు, 1919లోని బెంట్లీ కారు సహా… పలు రకాల వాహనాలను నూర్ మహల్ లో సందర్శనకు ఉంచారు. 1971 జరిగిన భారత్ -పాకిస్తాన్ యుద్ధంలో సైనికులు వాడిన విల్లీస్ జీప్ …ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని 1960లో తయారు చేసినట్లు నూర్ హోటల్ యాజమాన్యం తెలిపింది. దేశ చరిత్రలో భాగమైన అరుదైన వాహనాలను నేరుగా చూడటంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.
Latest news,Telugu news,National news