Nsnnews// మల్లన్నసాగర్ నిర్వాసితులపై CM రేవంత్ రెడ్డి కపట ప్రేమను చూపిస్తున్నారని… మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరహారం ఇవ్వలేదనే గ్లోబల్ ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. నిర్వాసితులకు ఎంత పరిహారం చెల్లించామో బాధితులని అడిగితే చెబుతారని వెల్లడించారు. ఒక్కో ఇంటికి 7లక్షల50 వేలు చెల్లించి.. గజ్వేల్, సిద్ధిపేట, అనంతగిరిలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చామన్నారు. రేవంత్ రెడ్డి మూసీ బాధితులకు ఏమి ఇచ్చి ఇండ్లను కూలగొడుతున్నారో చెప్పాలన్నారు. గచ్చిబౌలిలో మూసీ బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Latest news,Telugu news,Telangana news,Politics news