Nsnnews// క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఆర్ట్ గ్యాలరీ నిర్వహించడం హర్షనీయమని.. మాజీ ఐఏఎస్ అధికారి రాజా కుమార్ తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు హరి ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మాజీ బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణమోహన్, మైరామ్ సంస్థ చైర్మన్ యువరాజ్, మాజీ న్యాయమూర్తి మాల్యాద్రిలతో కలిసి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. భయంకర క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహనతో మెలగాలని సూచించారు. జీవన విధానంలో చోటుచేసుకున్న మార్పులు తీవ్రమైన కాలుష్యం కారణంగా… క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారు నానాటికి పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని పేర్కొన్నారు. చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం… వెచ్చించడం అభినందనీయమని తెలిపారు.
Latest news,Telugu news,National news