Nsnnews// బుల్డోజర్ జస్టిస్ పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ చేపట్టిన బుల్డోజర్ కేల్చివేతలపై సుప్రీం సీరియస్ అయ్యింది. బుల్డోజర్ జస్టిస్ పై యూపీ ప్రభుత్వానికి చురకలు అంటించిన సుప్రీం…కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే.. తమ ఆర్డర్‌ను ఉల్లంఘించి రిస్క్ తీసుకోవాలనుకుంటే.. అది మీ ఇష్టమంటూ కామెంట్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని యూపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదనలు వినిపించారు.బహ్రెయిచ్ జిల్లాలో అక్టోబర్ 13న జరిగిన దుర్గా మాతా నిమజ్జన సమయంలో చెలరేగిన అల్లర్లల్లో..22 ఏండ్ల యువకుడు చనిపోయాడన్న అడ్వకేట్..తన క్లయింట్, అతడి సోదరులు సరెండర్ అయ్యారని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. నోటీసులకు జవాబు ఇచ్చేందుకు గడువును 15 రోజులకు పెంచింది. కక్షపూరితంగానే ప్రభుత్వం కూల్చివేతల నోటీసులు ఇచ్చిందని అడ్వకేట్ సీయూ సింగ్ వివరించారు.
Latestnews, supremecourt, UttarPradeshnews…