Home చదువు AP పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు || Key Changes in AP Class 10 Exam Pattern

AP పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు || Key Changes in AP Class 10 Exam Pattern

0

 

Nsnnews// వచ్చే విద్యా సంవత్సరం నుంచి…ఏపీ పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని..ఏపీ పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే పదో తరగతి సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే అమలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. విద్యార్థులు కూడా తమ పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ చదువుతూనే రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈ విధానంలో ఇంటర్నల్‌ మార్కుల విధానం అమలులో ఉంది. దీనిని కూడా అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ సమాయాత్త మవుతుంది. అయితే గతంలో సీసీఈ విధానంలో ఇంటర్నల్‌ మార్కులు విధానం అమలులో ఉండగా.. 2019లో దీనిని రద్దు చేశారు.ఇంటర్నల్‌ మార్కుల విషయంలో ప్రభుత్వ బడులు నిబంధనలు పాటిస్తున్నప్పటికీ.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటున్నాయని ఫిర్యాదులు రావడంతో… గతంలో ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక విద్యాశాఖ తాజా నిర్ణయంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి… పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాత పరీక్షకు 80 మార్కులు, 20 ఇంటర్నల్‌ మార్కులు ఇవ్వనున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకోకుండా… పకడ్బందీగా చర్యలు తీసుకువచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. సీబీఎస్‌ఈలో ఇంటర్నల్‌ మార్కుల 20కి 20 వేసుకోకుండా.. ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఇస్తున్నారు. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున ఇస్తున్నారు. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా విద్యాశాఖ మార్పు చేయనుంది.

Latestnews ,Telugunews, Apnews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version