Home తెలంగాణ అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు TGSRTC రూ.307 కోట్ల ఆదాయం || TGSRTC Rs.307 Crore Revenue From 1st October to 15th

అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు TGSRTC రూ.307 కోట్ల ఆదాయం || TGSRTC Rs.307 Crore Revenue From 1st October to 15th

0

 

Nsnnews// దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. బతుకమ్మ, దసరా పండుగల వేళ ఈనెల 1 నుంచి 15 వరకు ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా సంస్థకు 307 కోట్ల ఆదాయం సమకూరింది. 15 రోజుల్లో కోట్లాది మంది ప్రయాణికులు RTC బస్సుల్లో ప్రయాణాలు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం సహా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్రకు సైతం అదనపు బస్సులను నడిపించింది. గత దసరాతో పోల్చితే ఈసారి మహాల క్ష్మిపథకం అమలు వల్ల రద్దీ ఎక్కువైందని అధికారులు అంచనావేశారు. RTC బస్సుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీపై సంస్థ MD సజ్జనార్ స్పందించారు. బస్సుల పుట్ బోర్డుపై విద్యార్థులు వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినవి తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచుతామని సజ్జనార్ స్పష్టంచేశారు. విద్యార్థుల కు రవాణాపరంగా ఇబ్బందుల్లేకుండా చూస్తామన్న ఆర్టీసీ MD… ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని సూచించారు.

 

Latestnews, Telugunews, Telangananews, TGSRTC….

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version