Nsnnews// మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కాలేజీ బస్సులు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ మృతి చెందగా.. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో.. బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు కాలేజీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలవ్వగా.. డ్రైవర్ నాగరాజు మృతి చెందాడు. మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest news,Telugu news,Telangana news,Medak district