Nsnnews// ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై.. కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన..దేవర చిత్రం..కామారెడ్డి శాంతి థియేటర్‌లో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్..కథానాయిక జాన్వీ కపూర్‌తో కలిసి నటించిన ఈ మూవీని తిలకించేందుకు.. ఎన్టీఆర్ అభిమానులు..జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్‌కు పోటెత్తారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్యక్ష, వ్యవస్థాపకులు ముజీబొద్దీన్, మల్లేష్‌లు మాట్లాడారు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్‌లో కేక్ కట్ చేసి సంబరాలల్లో మునిగి తేలారు అభిమానులు. చాలా రోజుల తర్వాత జూ.ఎన్టీఆర్ సినిమా దేవర తెరకెక్కడంతో..మూవీ చూసేందుకు వచ్చిన అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లింది. కార్యక్రమంలో..ఎన్టీఆర్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయిలుతో పాటు..అభిమానులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Kamareddy news,Telangana news