Home చదువు గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చెల్లదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు || HC On Group-1 Posts

గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చెల్లదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు || HC On Group-1 Posts

0
గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చెల్లదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు || HC On Group-1 Posts

 

Nsnnews// గ్రూప్ వన్ పోస్టులకు 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయకుండా.. మరొకటి జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందినవారు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జె.సుధీర్ వాదనలు వినిపిస్తూ.. 2022లో 503 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాలతో పరీక్ష రద్దయిందని తెలిపారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి.. తాజాగా మరొకటి జారీ చేయడం చెల్లదన్నారు. ఈ 60 ఖాళీలను విడిగా భర్తీ చేయాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ లను 6 నుంచి 10 శాతానికి పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం…TGPSCకి ఉందని పేర్కొన్నారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

Latest news,Telugu news,Telangana news,National news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version