Home జాతీయం నిరుద్యోగ పరిస్థితిపై రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు || Rahul Gandhi criticizes BJP on unemployment situation

నిరుద్యోగ పరిస్థితిపై రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు || Rahul Gandhi criticizes BJP on unemployment situation

0
నిరుద్యోగ పరిస్థితిపై రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు  || Rahul Gandhi criticizes BJP on unemployment situation

 

Nsnnews// ప్రధాని నరేంద్రమోదీ అవలంబించిన “గుత్తాధిపత్య-నమూనా” దేశంలో ఉద్యోగాలను తుడిచిపెట్టిందని..లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానాలతో MSMEలు నాశనమయ్యాయని, ఉద్యోగ సృష్టి ధ్వంసమైందని…ఎక్స్ వేదికగా విమర్శించిన రాహుల్…ప్రజలు అవకాశాలు కోల్పోయేలా చేశారని మండిపడ్డారు.  GSTని సులభతరం చేసి బ్యాంకింగ్ ను చిన్నవ్యాపారాలకూ విస్తరించి…ఉద్యోగ కల్పనను ప్రోత్సహించాలని సూచనలు చేశారు. బ్యాడ్ GST,పెద్ద నోట్ల రద్దు వంటి అసమర్థ విధానాలతో…చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై క్రమబద్ధమైన దాడి జరిగిందన్నారు. అది భారత్ ను ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నుంచి…వినియోగిత ఆర్థిక వ్యవస్థగా మార్చిందని వెల్లడించారు. ప్రస్తుత వృద్ధిరేటుతో మనం చైనాతో పోటీ పడలేమని…స్పష్టం చేశారు. దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థలకు రాజకీయ వ్యవస్థపై నియంత్రణ ఉందన్న రాహుల్ గాంధీ.. వారు ప్రభుత్వంపై క్రమబద్ధమైన దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. భారత యువతకు నైపుణ్యం, సామర్థ్యం చాలా ఉన్నాయని..వారికి తోడ్పాటు అందించాలని కోరారు.

Latest news,Telugu news,National news,Politics news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version