Nsnnews// ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టేందుకు… పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే.. 15వ ఆర్థిక సంఘం నుంచి 19 వందల 87 కోట్లు, NREGS ద్వారా 4 వేల 500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు. నిధుల అందడంతో.. నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో ..అభివృద్ధి పనులను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభంపై.. ఈ సమావేశంలో చర్చించారు. 13వేల 326 పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారని..ఆ మేరకు చేపట్టే పనులు, పని దినాల వివరాలను అధికారులు తెలిపారు. వెబ్ సైట్, డ్యాష్ బోర్డ్ ను ప్రారంభించారు. మొదలుపెట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని..అక్టోబర్ 14వ తేదీ నుంచి వారం రోజులపాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. 20వ తేదీ వరకూ పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇందులో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Andhra pradesh news