Nsnnews// ఈడీ రైడ్స్ పై మంత్రి సీతక్క స్పందించారు. సహాచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై జరిగిన ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆమె ఆరోపించారు.
ప్రతిపక్ష ప్రభుత్వాలను లొంగదీసుకునేందుకు..బీజేపీ ఈడీని వినియోగిస్తుందని సీతక్క వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కులగొట్టడన్నే… మొదటి నుంచి బీజేపీ పనిగా పెట్టుకుందని మంత్రి వ్యాఖ్యానించారు. గట్టిగా మాట్లాడిన ప్రతిపక్ష ఎంపీల ఇళ్ల మీదకు ఈడీని పంపిస్తామని పార్లమెంట్ సాక్షిగానే బీజేపీ ఎంపీలు మాట్లాడారని తెలిపారు. ఈడి, సీబీఐలను పచ్చిగా దుర్వినియోగిస్తుందని సీతక్క పేర్కొన్నారు. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటుందని.. అందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం పై ఈడి దాడి జరిగిందన్నారు. బలంగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలల్లోకి తీసుకెళుతున్న కారణంతోనే.. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ దాడి చేసిందన్నారు. పొంగులేటి నివాసంపై ఈడి దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయం ఎదుర్కోవాలి తప్ప.. ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేతల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే కుట్రలను.. మోడీ, అమిత్ షా, అదానీలు, అంబానీలు మానుకోవాలని సూచించారు మంత్రి సీతక్క.
Latest news,Telugu news,Telangana news,Politics news