Nsnnews// ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కావూరి హిల్స్ లో సినర్జీ యూనివర్సల్ కంపెనీ కార్యాలయం ప్రారంభించింది. కొలువులు ఇచ్చి లక్షల్లో జీతాలు ఇస్తామని నమ్మబలికిన యాజమాన్యం ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఉద్యోగులకు ఆఫర్ లెటర్ చేతికిచ్చి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి ఆర్నెళ్లు పబ్బం గడిపారు. 500 వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్నెళ్లుగా జీతాలు చెల్లించడం లేదని డబ్బులిచ్చినవారంతా యాజమాన్యాన్ని నిలదీశారు. కంపెనీకి ప్రాజెక్టులు రాలేదని వచ్చాక జీతాలుంటాయని కాలం గడుపుతూ వచ్చారు. యాజమాన్యం బిచాణా ఎత్తివేసిందని తెలుసుకున్న ఉద్యోగులు..మాదాపుర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.
Latest news,Telugu news,Telangana news