Nsnnews// ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ -TCS జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 11 వేల 909 కోట్ల నికర లాభాన్నినమోదు చేసింది. 2023-24 ఇదే త్రైమాసిక లాభం 11 వేల 342 కోట్లతో పోలిస్తే….ప్రస్తుత నికర లాభం 4.99 శాతం అధికమని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన నివేదికలో పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో.. 12 వేల 40 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే మెుత్తం ఆదాయం 60 వేల 698 కోట్ల నుంచి 7.06 శాతం పెరిగి..64 వేల 988 కోట్లకు చేరిందని తెలిపింది. రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5 వేల 726 మేర పెరిగి… 6 లక్షల 12 వేల 724కు చేరుకుందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య… ఇప్పటివరకు నికరంగా 11 వేలు పెరిగిందని పేర్కొంది. ఒక రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుపై 10 రూపాయల చొప్పున రెండో మధ్యంతర డివిడెండును చెల్లించేందుకు… డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు TCS తెలిపింది.
Latest news,Telugu news,Business news