Home తెలంగాణ విద్వేషాలు వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ కాంగ్రెస్ || Congress is a factory of hatred..

విద్వేషాలు వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ కాంగ్రెస్ || Congress is a factory of hatred..

0
విద్వేషాలు వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ కాంగ్రెస్ || Congress is a factory of hatred..

 

Nsnnews// కాంగ్రెస్‌ ఒక బాధ్యతారహిత పార్టీ అని, హిందువులను విభజించాలని చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందువుల్లో చీలికను తెచ్చి మరో వర్గానికి వ్యతిరేకం చేయాలనుకుంటుందని విమర్శించారు. హస్తం పార్టీని విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీగా అభివర్ణించారు మోడీ. మహారాష్ట్రలో 7,600కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు.హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. ఈ గెలుపు దేశం మూడ్​ను సూచిస్తోందన్న ఆయన…మహారాష్ట్రలో కూడా భారీ విజయం సాధించాలన్నారు.ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ అధికారం కోసం మహారాష్ట్రను బలహీనపరచాలని కోరుకుంటోందన్నారు. అయితే పాలకపక్షం మహాయుతి సర్కార్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఇంతవేగంగా ప్రాజెక్టులు పూర్తవ్వడం నేనెప్పుడూ చూడలేదని చెప్పాడు. కాంగ్రెస్ బాధ్యతారహిత పార్టీ. విద్వేషాలను రెచ్చగొట్టే ఫ్యాక్టరీ అని అన్నారు నరేంద్ర మోడీ.

కాంగ్రెస్ అభివృద్ధి గురించి ఆలోచించదని ప్రధాని మోదీ విమర్శించారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధితో కూడిన వికసిత్ భారతే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముస్లింలలో భయాందోళనలు సృష్టిస్తోందని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆరోపించారు. మరోవైపు, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజకీయ ప్రసంగం చేయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎందుకు ఉపయోగించారని ప్రశ్నించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రాజకీయ ప్రసంగాలకు వాడుకోకూడని.. కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ ఛార్జ్ పవన్ ఖేడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని, ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్​ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏకం చేస్తోందని చెప్పారు.

Latestnews, Telugunews, narendramodi, Congress Party..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version