Home Blog Page 8

తమిళనాడులో మరో “జనసేన” || Another “Janasena” in Tamil Nadu

 

Nsnnews// ఏపీలోని జ‌న‌సేన త‌ర‌హా పార్టీ త‌మిళ‌నాడులోనూ ఆవిర్భ‌వించింది. ప్ర‌ముఖ త‌మిళ‌ హీరో విజ‌య్‌.. త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న అప్ప‌ట్లో త‌న పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వ‌హించిన టీవీకే పార్టీ తొలి మ‌హానాడులో ఆయ‌న త‌న పార్టీ సిద్ధాంతాలు స‌హా భ‌విష్య‌త్తును ఆవిష్క‌రించారు. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని డీఎంకేని ఆయ‌న తూర్పార బ‌ట్టారు. నిరంకుశ పాల‌న‌కురెండు ప్ర‌భుత్వాలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక్క‌డ ప‌వ‌న్ మాదిరిగానే..

ఏపీలో తొలినాళ్ల‌లో జ‌నసేన అధినేత ప‌వ‌న్‌ను న‌టుడు.. సినిమాలు చేసుకునేవాడు.. అంటూ కొంద‌రు విప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అలానే విజ‌య్‌నుకూడా.. రాజ‌కీయంగా ఆట‌ప‌ట్టించ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని విజ‌య్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. “న‌న్ను ఆర్టిస్ట్‌ అంటూ పలువురు విమర్శ‌లు చేస్తున్నారు. అయినా వెర‌వ‌ను. న‌టులు ప్ర‌జాసేవ‌కు ప‌నికి వ‌స్తార‌ని ఎన్నో ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఏపీలో నంద‌మూరి తార‌క రామారావు, త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌లు రాణించ‌లేదా..? ప్ర‌జా నాయ‌కులుగా వెలుగొంద‌లేదా?” అని త‌న‌దైన శైలిలో ఆయ‌న ప్ర‌సంగించారు.

అనుభ‌వం లేద‌ని..

జ‌న‌సేన అధినేత 2014లో పార్టీని ప్ర‌క‌టించినప్పుడు.. అనుభ‌వం లేదంటూ.. కొంద‌రు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్‌.. విజ‌య్‌ను ఉద్దేశించి కూడా కొంద‌రు ఇవే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీనికి కూడా విజ‌య్ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు’’ అని అన్నారు. సినిమాల‌తో పోల్చుకుంటే.. రాజ‌కీయాలు ఎలా ఉంటాయో త‌న‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు.

ఇక్క‌డ అంద‌రూ రాజ‌కీయాల‌తో ఆడుకునే వారేన‌ని చెప్పారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా అని విజ‌య్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో విజ‌యం సాధించి, అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని విజ‌య్ ప్ర‌క‌టించారు.

ఇవీ.. సిద్ధాంతాలు..

.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాల ప‌రిర‌క్ష‌ణ‌

.లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలను అనుస‌రించ‌డం.

.పెరియార్‌ రామస్వామి, కామరాజ్ నాడార్‌, అంబేడ్కర్ ఆశయాల సాధ‌న‌

.బీజేపీ, డీఎంకేల నిరంకుశ వైఖ‌రిపై పోరాటాలు

.రాజకీయాల్లో మహిళలకు కీలక పాత్ర

Latest news, Telugu news, Tamilnadu news, Vijay Thalapathy..

ఇది వైసీపీ కాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌ || This is not YCP.. Coalition government beware: Pawan

 

Nsnnews// “ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాదు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చేయ‌డానికి. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్య‌వహరించ‌డానికి నిధులు దారి మ‌ళ్లించ‌డానికి. ఇది కూట‌మి ప్ర‌భుత్వం అన్న విష‌యం గుర్తు పెట్టుకోండి. ప్ర‌తి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్ర‌తి రూపాయికీ జ‌వాబుదారీ త‌నం ఉంటుంది” అని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తేల్చి చెప్పారు. తాజాగా ఆయ‌న పంచాయ‌తీరాజ్ శాఖ అధికారుల‌తో వీసీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌పై ఆరా తీశారు.

ఆయా నిధుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తున్నారో.. పూర్తి వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ప‌వ‌న్ సూచించారు. “అందుబాటులో అంటే.. అర్ధం కాని వివ‌రాలు, ఇంగ్లీష్‌లో ఉండ‌డం కాదు. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకున్న వారికి కూడా.. మ‌నం ఏం చేస్తున్నామో.. చ‌ద‌వ‌గానే అర్ధం కావాలి. ప్ర‌తి రూపాయికీ లెక్క చూపించాలి. ప్ర‌తి గ్రామంలోనూ చేప‌ట్టిన ప‌నులు.. ఎవ‌రు చేస్తున్నారు. ఏయే ప‌నుల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేస్తున్నాం అనే వివ‌రాలు స్ప‌ష్టంగా ఉండాలి” అని ప‌వ‌న్ ఆదేశించారు.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి పంచాయ‌తీల‌కు వ‌చ్చిన నిధుల‌ను దారి మ‌ళ్లించార‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారుపై గ్రామీణులు చాలానే ఆశలు పెట్టుకున్నార‌ని తెలిపారు. వారి ఆశ‌లు వ‌మ్ముకావ‌డానికి వీల్లేద‌ని.. ప్ర‌తి రూపాయినీ వారికి చెప్పాల‌ని అన్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న ప్ర‌తిరూపాయీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ‌ద‌లాయించాల‌న్నారు. అదేవిధంగా అధికారులు జ‌వాబు దారీ త‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

ఇక‌, ప‌ల్లె -పండుగ‌, పంచాయ‌తీ వారోత్స‌వాల్లో అనుమ‌తించిన ర‌హ‌దారుల నిర్మాణం, మంచినీటి పైపు లైన్ల నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నులను వేగంగా పూర్తి చేయాల‌ని చెప్పారు. ఈ ప‌నులు అత్యంత నాణ్యంగా ఉండాల‌ని.. సొంత ఇంటికి ఎలా అయితే.. శ్ర‌ద్ధ‌తో ప‌నులు చేయించుకుంటారో.. అలానే ఈ ప‌నులు కూడా ఉండాల‌ని అధికారుల‌కు హిత‌వు ప‌లికారు. ముఖ్యంగా ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ప‌దే పదే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Latestnews, Telugunews, AP news, Deputy CM Pawan Kalyan..

అక్రమ ఇసుక వ్యాపారులకు MLA తంగిరాల సౌమ్య వార్నింగ్ || MLA Tangirala Sowmya warning to illegal sand traders

 

Nsnnews// వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ..వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారుప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్‌, జీఎస్‌టీ రద్దు చేసిందన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్థానిక అవసరాలకు నదుల్లో ఇసుక సేకరించేవారు స్థానిక అధికారులకు సమాచారం అందించిన తరువాత మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుందని సూచించారు. ఇసుక తీసుకెళ్లే వాహనాలపై ఉచిత ఇసుక పథకం బ్యానర్‌ ఉండాలన్నారు. బల్క్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కేసులు పెట్టడమే కాకుండా పీడీ యాక్టును ప్రయోగిస్తామన్నారు. ఇసుక రవాణాకు ఈ-ట్రాన్సిట్‌ ఫారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్‌, ఉచిత ఇసుక బ్యానర్‌ ఉండాలన్నారు.

Latest news, Telugu news, AP news, Crime news, MLA Tangirala Sowmya..

పొలంలో పనిచేస్తూ వ్యవసాయ కూలీ మృతి || An agricultural laborer died while working in the field

 

Nsnnews// బతుకు తెరువు కోసం కూలిపనికి వెళ్లి పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన చంద్రమౌళి, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన కొప్పు చంద్రమౌళి(43), ఉదయాన్నే లేచి సంగాయగుడెం ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో సమాచారం అందుకొన్న TDP సుబ్బరాజు ఉచిత అంబులెన్స్ చంద్రమౌళి ను హాస్పిటల్ వద్దకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతదేహాన్ని అదే అంబులెన్స్ నందు త్యాజంపూడిలోని కుటుంబీకుల వద్దకు చేర్చామని పైలెట్ కొమ్మర్తి మహేష్ తెలిపారు.

Latestnews, Telugu news, AP news, Chandramouli, TDP subbaraju..

డివైడర్ ను కూల్చిన వారిపై చర్యలు తీసుకొని, వెంటనే డివైడర్ కట్టాలని కలెక్టర్, SP లకు పిర్యాదు || Complaint to the Collector and SP to take action against those who demolished the divider and build the divider immediately

 

Nsnnews// కామారెడ్డి పట్టణంలోని GVS కళాశాల ఎదుట ఉన్న రోడ్డు డివైడర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయటం జరిగింది. ఇట్టి విషయంలో విచారణ జరిపి కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా ప్రమాదాలు జరగకుండా వెంటనే కూల్చివేతకు గురైన డివైడర్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ (SP) గారికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు పిర్యాదు చేయటం జరిగింది.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

భారత్ ను విశ్వ గురువుగా చేయాలన్నదే నరేంద్ర మోదీ గారి కల || Narendra Modi’s dream is to make India a world teacher

 

Nsnnews// కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం అయ్యింది. 10 కోట్ల మంది బీజేపీ లో సభ్యులుగా చేరారు. కామారెడ్డి మున్సిపల్ బీజేపీ కైవసం, కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని 15 వ వార్డుకి చెందిన TRS నాయకుడు భూమేష్ యాదవ్ తో పాటు 21 మంది కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ లో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారత్ ను విశ్వ గురువుగా చేయాలన్నదే నరేంద్ర మోదీ గారి కల అని వికసిత భారత్ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్ళ కాలంలో బీజేపీ కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం అయ్యిందనీ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయ్యి 2 నెలలు కాక ముందే 10 కోట్ల మంది బీజేపీ లో సభ్యులుగా చేరారనీ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి లోని అన్ని వార్డులు బీజేపీ గెలిచి ఛైర్మెన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

కామారెడ్డిలో జరగబోయే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మ అనివార్య కారణాల ద్వారా వాయిదా || Nizamabad Joint District Madigala Dharma to be held at Kamareddy tomorrow has been postponed due to unavoidable reasons

 

Nsnnews// రేపు కామారెడ్డిలో జరగబోయే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ కొన్ని అనివార్య కారణాల ద్వారా వాయిదా వేయడం జరిగిందని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం లో రేపటి మహాసభ అనివర్య కారణాల వల్ల రద్దు చేయబడిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు మాట్లాడారు. దయచేసి అందరూ సహకరించగలరు. మళ్ళీ మహాసభ ఎప్పుడు అనేది అతి త్వరలో తెలియజేస్తాం. అందరూ పనిలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. MRPS, MSP MSF కామారెడ్డి జిల్లా కమిటీ, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి గాని లక్ష్మి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్టవెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ నాయకులు పురుషోత్తం పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

కాంగ్రెస్ సభ స్టేజిని గుద్దుకొని యువకుడు మృతి || A young man died after punching the stage of the Congress House

 

Nsnnews// యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ మండలం మానాయకుంట గ్రామ బ్రిడ్జిపై మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం అంటూ కాంగ్రెస్ నేతలు స్టేజిని ఏర్పాటు వేశారు. బ్రిడ్జిపై స్టేజి వేయడంతో, బాట ఉందని ఎప్పటిలానే బైక్‌పై వెళ్లిన చరణ్(17) అనే యువకుడు స్టేజిని గుద్దుకుని మరణించాడు. చరణ్‌ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, హుటాహుటిన కాంగ్రెస్ నాయకులు స్టేజిని తొలగించారు.

Latestnews, Telugunews, Telangananews…

మాజీ ఐపీఎస్ ఇంట్లో పెండ్లికి బ్యాండ్ వాయిస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ || Battalion constables playing a wedding band at the house of an ex-IPS

 

Nsnnews// మాజీ ఐపీఎస్ ఇంట్లో పెండ్లికి బ్యాండ్ వాయిస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్న వేళ మరో వివాదం. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెండ్లి కాజీపేటలోని ఓ చర్చిలో జరిగింది. ఈ పెండ్లికి బ్యాండ్ వాయించేందుకు మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఆ పని అప్పగించాడు. బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు జరుగుతున్న వేళ కానిస్టేబుళ్లతో బ్యాండ్ వాయించడం ఏంటని ప్రశ్నిస్తే, ఆ అధికారి నిబంధనల మేరకే ఈ పనులు చేపించుకుంటున్నాం అని సమర్థించుకున్నాడు.

Latestnews, Telugunews, Telangananews…

తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు || The house was demolished before they could go to Tirupati

 

Nsnnews// ముసాపేట పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని కూల్చివేసిన అధికారులు బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు. తిరుపతి వెళ్లి వచ్చే సరికే అధికారులు అక్రమ నిర్మాణం అంటూ ఇంటిని కూల్చివేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…

Exit mobile version