Home బిజినెస్ LPG eKYC: వంటగ్యాస్‌ ఈకేవైసీకి తుది గడువుపై.. కేంద్ర మంత్రి క్లారిటీ || LPG eKYC: Final deadline for cooking gas eKYC.. Union Minister Clarity

LPG eKYC: వంటగ్యాస్‌ ఈకేవైసీకి తుది గడువుపై.. కేంద్ర మంత్రి క్లారిటీ || LPG eKYC: Final deadline for cooking gas eKYC.. Union Minister Clarity

0
LPG eKYC: వంటగ్యాస్‌ ఈకేవైసీకి తుది గడువుపై.. కేంద్ర మంత్రి క్లారిటీ || LPG eKYC: Final deadline for cooking gas eKYC.. Union Minister Clarity

 

Nsnnews// దిల్లీ: గ్యాస్‌ వినియోగదారులు ఈకేవైసీ నమోదు (LPG eKYC compliance) ప్రక్రియ చేపట్టాలంటూ కొన్ని నెలల కిందట కేంద్రప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది. దీంతో ఎల్‌పీజీ కంపెనీలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, గ్యాస్‌ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌.. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ (Hardeep Singh Puri)కి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. అంతేగాక.. దీని నమోదుకు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు.
‘‘బోగస్‌ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్‌ సంస్థలు (Oil Marketing Companies) ఈకేవైసీ ఆధార్‌ అథెంటికేషన్‌ పక్రియను చేపడుతున్నాయి. గత 8 నెలలుగా ఇది కొనసాగుతోంది. ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్స్‌ వివరాలను వెరిఫై చేస్తారు. వారి మొబైల్‌ ఫోన్లలోని యాప్‌తో వినియోగదారుల ఆధార్‌ వివరాలను నమోదు చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. లేదా కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు దగ్గర్లోని డిస్ట్రిబ్యూటర్‌ షోరూమ్‌కు వెళ్లి కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. దీంతో పాటు చమురు మార్కెటింగ్‌ సంస్థల యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొని సొంతంగా కేవైసీ అప్‌డేట్‌  చేసుకోవచ్చు’’ అని కేంద్రమంత్రి వివరించారు.
ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని హర్‌దీప్‌ సింగ్‌ పూరీ స్పష్టం చేశారు. ఎల్‌పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనేదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని తెలిపారు.
Latest news,Telugu news,Business news…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version