Nsnnews// ముస్తాబాద్: తెలంగాణ తొలి సమాజకవి సిద్ధప్ప వరకవి 121 వ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన మండల సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు..సభ్యులు సిద్ధప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఘన నివాళులు అర్పించిన వారు… ఈ సందర్భంగా మాట్లాడారు. //1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లె గ్రామంలో జన్మించినట్టు చెప్పారు. పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదిగిన సిద్ధప్ప వరకవి.. శాలివాహనుల అభివృద్ధికి సుదీర్ఘ పోరాటం చేశారన్న వారు, కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వరకవి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన మండల అధ్యక్షుడు సిలివేరి స్వామి, ఉపాధ్యక్షుడు ఎదునూరి రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య, ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకటి, ఎదునూరి రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు ఏదునూరి అంజయ్య, ఉపాధ్యక్షుడు దరిపల్లి శంకర్, శాలివాహన యువజన సంఘం అధ్యక్షుడు ఎదునూరి భానుచందర్, ఉపాధ్యక్షుడు ఎదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య, స్వామి, లక్ష్మిపతి, అశోక్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news…