JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల
JEE మెయిన్-2024 సెషన్ 2 ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. jeemain.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి, అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును విద్యార్థులు పొందొచ్చు. ఏప్రిల్ 25 కంటే ముందుగానే JEE మెయిన్ ఫలితాలను NTA విడుదల చేసే అవకాశం ఉంది. JEE మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొందిన 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయనున్నారు.