Nsnnews// హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ప్రగతినగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్, కోఠి, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోఠి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వచ్చే మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Latest news,Telugu news,Telangana News,Hyderabad News