Nsnnews// రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం కోసం.. ప్రభుత్వం కృషి చేస్తోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు మంత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో గుండి గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండడంతో వాహనాలు వెళ్లకపోవడంతో… అటవీశాఖ జీపులో అక్కడికి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో జీపు వెళ్లకపోవడంతో అదే వాగులో నడుచుకుంటూ వచ్చి.. మరో వాహనంలో ఆసిఫాబాద్ లోని జనకాపూర్లోకి చేరుకుని మొబైల్ సైన్స్ ల్యాబ్ బస్సును ప్రారంభించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పాఠశాలల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఉన్న సమస్యలు ఆరా తీసి.. వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. ప్రభుత్వం కృషి చేస్తూ…ముందుకెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Telangana news