Nsnnews// హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈనెల21 నుంచి జరిగే గ్రూప్-వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టిన అభ్యర్థులను.. పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అభ్యర్థుల అరెస్టులను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అభ్యర్థుల పక్షాన మద్దతుగా నిలబడతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అశోక్ నగర్ ఐనా, తెలంగాణ భవన్ వేదికగా అయినా సరే మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. అరెస్టు చేసిన అభ్యర్ధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల కాంగ్రెస్ చూపిన.. కపట ప్రేమ అసలు రంగు బయట పడిందన్నారు.
latest news,Telugu news,Telangana news