Home తెలంగాణ సరికొత్త లుక్ తో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ…

సరికొత్త లుక్ తో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ…

0
సరికొత్త లుక్ తో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ…

 

Nsnnews// నటుడు మాస్ మహారాజా రవితేజ నటి శ్రీలీల ధమాకా మూవీతో ప్రేక్షకులను తమ నటనతో అలరించారు. ఈ జోడీ మరో సినిమాతో సందడి చేయనుంది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ నటించనున్న ఈ 75వ చిత్రానికి… యువ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో…రెగ్యులర్‌ చిత్రీకరణను నిన్ననే ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్‌నిచ్చారు. విజయవంతమైన పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఓ మంచి స్క్రిప్ట్‌తో, రవితేజ 75వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Latestnews, Telugunews, MassMaharaja RaviTeja…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version