Nsnnews// దుబ్బాక ;
దుబ్బాక నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి కి శీఘ్రగతిన చర్యలు తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.. హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎస్ఇ వసంత నాయక్ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు.. గతంలో మంజూరైన రోడ్ల పనులు నిలిచి పోయాయని, మెట్టు- అల్వాల రోడ్డు తో సహా నియోజకవర్గంలోని మిగతా రోడ్ల పనులు పూర్తి చేయాలన్నారు..దుబ్బాక పట్టణ సమీపంలోని రామ సముద్రం ,పెద్ద చెరువు కట్ట కింద రోడ్డు మీదికి చెరువు జాలు రాకుండా మురికి కాలువ ఏర్పాటు చేయాలని , అందే-తిమ్మాపూర్, సూరంపల్లి-నాచారం, మొండి చింత-బేగంపేట సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, హబ్సిపూర్ – దుబ్బాక రోడ్డు ను 4 లైన్ రోడ్డుగా, శిలాజీ నగర్ – గోసాన్ పల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు..గతంలో అల్వాల బ్రిడ్జి తదితర పనుల మంజూరు కోసం ప్రభుత్వం కు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.. సమావేశంలో ఈ ఈ బాల ప్రసాద్, డీఇ లు వెంకటేశం, శ్రీనివాస్, ఏఇ లు శ్రీనివాస్, విజయ సారధి లతో పాటు కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు.
Latest news,Telugu news,BRS Party,MLA Kota Prabhakar Reddy,development of roads…