Nsnnews// రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు సర్కార్ కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో మెగా జాబ్ మేళాను నిర్వహించగా 46 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలకు సూచించినట్టు ఆయన తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేములవాడ ప్రాంతంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు ఆది శ్రీనివాస్ చెప్పారు.
Latestnews, Telugunews, Adi Srinivas, Govt Jobs…