Nsnnews// సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, క్రీడల్లో కూడా రాహుల్ గాంధీకి రిజర్వేషన్లు కావాలేమో అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేశా చేశారు. రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్‌కు చెందిన గిరిజన యువతీ రియా ఎక్కా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుందని ఎక్స్‌లో పోస్టు చేశారు. మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న వారిలో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలు ఒక్కరు కూడా లేరని రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. మీడియా రంగంలోని టాప్ యాంకర్లలందరూ అగ్రవర్ణాల వారేనని వ్యాఖ్యానించారు. జనాభాలో 90 శాతంగా ఉన్న ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల భాగస్వామ్యం లేకపోతే దేశం సూపర్ పవర్‌గా ఎలా ఎదగలదని ప్రశ్నించారు.
Latestnews, Telugunews, Samvidhan Samman Sammelan, Rahul Gandhi, BJP Reaction..