Nsnnews// ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినాయక నిమజ్జనానికి వచ్చే రూట్ మ్యాప్‌ను పరిశీలించి మాట్లాడారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నిఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మండపాల ఆర్గనైజర్లు పోలీసుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. కోమటిచెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ సలీమ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news