Home తెలంగాణ కోచింగ్ సెంటర్లను నియంత్రణలో పెడుతాం || We will keep the coaching centers under control

కోచింగ్ సెంటర్లను నియంత్రణలో పెడుతాం || We will keep the coaching centers under control

0
కోచింగ్ సెంటర్లను నియంత్రణలో పెడుతాం || We will keep the coaching centers under control

 

Nsnnews// పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లపై నియంత్రణ లేని కారణంగా.. అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై చర్యలు తీసుకోలేకపోయామని ఆయన తెలిపారు.

 కోచింగ్ సెంటర్లను కంట్రోల్​లో పెడతామని మంత్రి శ్రీధర్ బాబు..సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్​-కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్​లైన్స్​ను అమలు చేసి, వాటిని కట్టడి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా.. జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారాయన. సబ్ కమిటీ సభ్యురాలు… పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే.. పేద విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల… మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 16వందల పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు.

 డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని శ్రీధర్​ బాబు వెల్లడించారు. తద్వారా వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు… పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్ మ్యాగజైన్​లను నడపాలని మంత్రి సూచించారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు…బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశ పెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version