Nsnnews// సింగరేణి ఆసుపత్రిలో స్కావేంజర్‌గా పనిచేస్తున్న వినయ్‌కు రామగుండం ఏరియాలోని 8 ఇంక్లైన్ కాలనీలో ఉండే అంజలితో పరిచయం ఏర్పడింది. అయితే అంజలికి అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వినయ్ ప్రేమలో మునిగిపోయిన అంజలి తన భర్త, పిల్లలను వదిలేసి విడాకులు ఇవ్వకుండానే వినయ్‌ను పెళ్లి చేసుకుంది. దీనిపై అంజలి మొదటి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అంజలికి కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి భర్త వద్దకు పంపించారు.. కానీ కొన్ని రోజులకే అంజలి మళ్లీ వినయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. దీంతో కోపం పెంచుకున్న అంజలి మొదటి భర్త, అంజలి సోదరుడు ఇద్దరు కలిసి వినయ్ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి కత్తులతో పొడిచి చంపారు. ఇదంతా జరిగింది తన వల్లే అని మనస్తాపంతో అంజలి ఆత్మహత్య చేసుకుంది.. ఈ వివాహేతర సంబంధంతో రెండు ఇండ్లల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Latest news,Telugu news,Telangana news,Crime news