Nsnnews// మెడక్ – నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటలో సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి గ్రామంలో ఇద్దరు మృతి చెందగా 100 మంది అస్వస్థత గురైన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా కొనసాగిన వైద్య శిబిరం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలుషిత నీరు రావడానికి మీరంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
Latest news,Telugu news,Telangana news,Medak news