NSN NEWS// హుస్నాబాద్:
లంబాడి బాలిక పై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం తోనే హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్ నడిగడ్డ తండాలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు జీవన ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి మియాపూర్ పరిధి నడిగడ్డ తండాలో కూలి పని చేసుకుంటున్నారని తెలిపారు. వారి కుమార్తె వారం రోజుల క్రితం దుకాణంకు వెళ్లి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. నేడు బాలిక తప్పిపోయిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో అత్యాచారం, హత్య చేసి తగలబెట్టిన బాలిక శవం కనిపించడం పోలీసుల నిర్లక్ష్య దర్యాప్తుకు నిదర్శనమన్నారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి బాలిక బ్రతికేదని వాపోయారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంతో పోలీసులు సమాధానం చెప్పి వదిలించుకున్నారని మండి పడ్డారు. వారం రోజులుగా స్పందించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను తక్షణమే పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Latest news,Telugu news…