Nsnnews// రెండు లక్షల లోపు మిగిలిన రుణాలను దీపావళి లోపు మాఫీ చేస్తామని.. త్వరలోనే రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీకి షెడ్యూల్ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసా సైతం అందిస్తామని వెల్లడించారు. పదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ .. నిరుద్యోగులకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ వచ్చాక 70వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు సైతం అందించామని తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు, హాలియ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు.
Latest news,Telugu news,Telangana news