Nsnnews// ఆఫ్రికా దేశం నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికిపైగా మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కనో నుంచి బయల్దేరిన పెట్రోల్ ట్యాంకర్ జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. ట్యాంకర్ హైవేపై బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు…పెట్రోల్ నింపుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు .
Latest news,Telugu news,National news