Nsnnews// గొడవను సద్దుమణిగించేలా మంత్రులతో మీడియా సమావేశం పెట్టాలని నిర్ణయం.ప్రెస్‌మీట్ పెట్టేందుకు తుమ్మల నిరాకరణ సీఎం విన్నపంతో సరేనన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రుణమాఫీపై జరుగుతున్న రగడను సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. కనీసం మంత్రులతోనైనా మీడియా సమావేశం పెట్టించి డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇటీవల ఒక సందర్భంలో సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది.
రుణమాఫీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, దీనిని నిలువరించేందుకు మంత్రులతో మీడియా సమావేశం ఏర్పాటుకు గురించి చర్చించినట్టు సమాచారం. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మీడియా సమావేశం నిర్వహించాలని కోరగా మంత్రి నిరాకరించినట్టు సమాచారం. ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించానని, మళ్లీ సమావేశం పెట్టాల్సిన అవసరం లేదని తోసిపుచ్చినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్నత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘ఉత్తమన్నా.. మీరన్నా ప్రెస్‌మీట్ పెట్టండి’ అని కోరినట్టు తెలిసింది. ఇందుకు అంగీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ పూర్తికాలేదని, ఇంకా 9.14 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Latestnews, Telugunews, RevanthReddy, Uttam reddy, Loan Waiver…