Nsnnews// కోకో టోర్నమెంటు ఫైనల్లో సాగిన ఉత్కంఠ భరితంగా అద్భుతంగా ఆడి మొదటి విజేతగా బహుమతిని కైవసం చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్ ముగింపు సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంధాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,డీఈఓ రాజు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడారు రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్లో విద్యార్థులు చాలా అద్భుతంగా రణించారని గెలుపు ఓటమి సహజమే అన్నారు. మొదటి విజేతగా ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకోవడం జరిగిందని. ద్వితీయ బహుమతి రంగారెడ్డి జిల్లా కైవసం చేసుకోవడం జరిగిందని,తృతీయ బహుమతి నిజామాబాద్ జిల్లా కైవాసం చేసుకోవడం జరిగిందని తెలిపారు, వారికి టోర్నమెంట్ కప్పులను మెమొంటోలను బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ రెడ్డి మాజీ గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, వివిధ జిల్లాల పిఈటిలు, గ్రామ వీడిసి సభ్యులు ఎంఈఓ ఆనందరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వివిధ సంఘాల నాయకులు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.
Latestnews, telugunews, Telangananews, Kamareddynews….