Home తెలంగాణ పేదింటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల అందజేత || Uppala Srinivas Gupta who showed humanity

పేదింటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల అందజేత || Uppala Srinivas Gupta who showed humanity

0
పేదింటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల అందజేత || Uppala Srinivas Gupta who showed humanity

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కిభగవతి భగవాన్ ఆలయంలో పేదంటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేసిన పుస్తె,మట్టేలను లను గుర్రాల సుజాత స్వామి ల కుమార్తె కళ్యాణికి,లింగంపల్లి పుష్ప శివకుమార్ ల కుమార్తె శివాని లకు ఆలయ దాసాజీ ప్రణయజి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల కుటుంబ సభ్యులు వారి పెళ్లిళ్ల కోసం పుస్తే,మట్టేలు కావాలని అడగడంతో ఈ విషయాన్ని ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు తెలియజేయడంతో వెంటనే స్పందించి పుస్తే,మట్టేలను అందజేయడం జరిగిందని అన్నారు.కులం,మతం అనే తేడా లేకుండా పేదింటి ఆడపిల్లలకు సహకారాన్ని అందజేస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.ఇప్పటివరకు 7000 మంది ఆడపిల్లల పెళ్లిలకు పుస్తె,మట్టేలను అందజేయడం సాధారణ విషయం కాదని,నేటి సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుందని ఆ డబ్బులు పేదవారికి, ఆపదలో ఉన్నవారికి అందజేసే మంచి మనసు కొందరికి ఉంటుందని అలాంటి కొందరు వ్యక్తుల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకరిని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ దాసాజీ ప్రణయజి,కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్త లు పాల్గొనడం జరిగింది.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version