Nsnnews// ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయి.. ఇవాళ్టితో 100 రోజులు పూర్తైంది. ఈ 100 రోజుల్లో న్యాయవ్యవస్థ సంస్కరణ దిశగా అడుగులు..విపత్తుల నిర్వహణ వంటి అనేక చర్యలను తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. పాత నేరచట్టాల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగ్రిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం నేర చట్టాలు అమలులోకి వచ్చాయి. ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి.. నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎన్ హాన్స్ మెంట్ స్కీమ్ కోసం.. ఐదేళ్లకు గానూ 2వేల 554 కోట్లను కేంద్రం ఆమోదించింది. కాలంతో పాటు నేర పద్ధతులు మారుతున్న తరుణంలో శాస్త్రీయ పరీక్షను నిర్ధారించడంలో కచ్చితత్వం కోసం ఇది ఉపయోగపడనుంది. UGC-NETలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు కలకలం రేపిన తర్వాత ఆ.. సమస్యలను అరికట్టేందుకు…పరీక్ష నిర్వహణలో విశ్వసనీయతను పెంపొందించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ బిల్లును ఆమోదించారు.
Latest news,Telugu news,National news