Nsnnews// ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. కోంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్ తల్ గ్రామంలో ప్రజలు కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నారు. బాధిత కుటుంబం చేతబడి చేయడమే తమ అనారోగ్యానికి కారణంగా భావించిన గ్రామస్తులు..ఒక్కసారిగా ఆగ్రహించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్షకు పంపినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనే 5రోజుల క్రితం..బలౌదాబాజార్ జిల్లాలో జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఆ ఘటనలో ఒక పసికందు సహా.. నలుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురైనట్టు వెల్లడించారు.
Latest news,Telugu news,Sukma district,Telangana and Andhra Pradesh,Crime news