Nsnnews// భూపాలపల్లి జిల్లా జూన్ 13: తెలంగాణ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓవర్‌టెక్, మద్యం తాగి నడపడం, అతి వేగం తదితర కారణాల వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ ప్రమాదాల వల్ల ఎందరో అమాయకులు బలవుతున్నారు. కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. తాజాగా. ఈరోజు భూపాల పల్లిజిల్లా దామరకుంట, విలాసాగర్, గ్రామాల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది,
వివరాలు కి వెళ్తే. దామర కుంట, నుండి గంగారం వైపు బైకుపై వెళ్తున్న అట్ల బాపు, విలాసాగర్ గ్రామానికి చెందిన కాపర బోయిన రాజయ్య అవసరం నిమిత్తము విలాసాగర్ నుండి దామరకుంట వెళుతున్న క్రమంలో రెండు బైకులు ఎదురుగా ఢీకొన్నాయి.
దీంతో ఇద్దరు కింద పడి పోగా, వారి వెనకాలే వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి ఇద్దరు వ్యక్తుల పై నుండి వెళ్లిపోవడంతో అట్ల బాపు అక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలతో ఉన్న రాజయ్యను కాటారం ప్రభుత్వ ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.
సంఘటన స్థలానికి చేరు కున్న కాటారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది.
Latest news,Telugu news,Accidents,Road accidents happen every day…