Nsnnews// అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మొదలైన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీలు.. వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో.. వారంపైగా జరుగుతున్న ఈ హింసాత్మక దాడులపై రాష్ట్ర హైకోర్టులో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరపాల్సి ఉంది. అయితే కోర్టు ప్రారంభమైన కాసేపటికే విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15కు ఈ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Latestnews, Telugunews, AP Politics, TDP, BJP, Janasena, YSRCP…