Nsnnews// భారతీయ వాహన విపణికి సరికొత్త విద్యుత్ వాహన విభాగాన్ని వింగ్స్ ఈవీ పరిచయం చేయబోతోంది. దేశంలో తొలి విద్యుత్ సూక్ష్మ కారు (ఎలక్ట్రిక్ మైక్రో-కార్) రాబిన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులో విడుదల చేయబోతోంది. ఇందులో మోటార్ బైక్ తరహాలో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ‘శూన్య కాలుష్యం, తక్కువ రహదారి స్థల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మైక్రో-కార్‌ను తీసుకొస్తున్నామ’ని వింగ్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ దండేకర్ వెల్లడించారు.
Latest news,Telugu news,Business news