Home Blog

జడ్పీహెచ్ఎస్ రావురుకుల పాఠశాలలో 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ||1998-99 Alumni Reunion at ZPHS Ravurukula School…

 

Nsnnews// రావురుకుల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1998-99 విద్యాసంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నవంబర్ 9న ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాలతో గడిపారు.

ఈ సమ్మేళనానికి ఆ తరగతి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కూడా విచ్చేసి, పూర్వ విద్యార్థులతో సందడి చేశారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో జ్ఞాపకాల జ్ఞాపికలుగా ఉన్న చిన్ననాటి సంఘటనలను, ఆడిన ఆటలు, చేసుకున్న స్నేహాలను తిరిగి గుర్తు తెచ్చుకుంటూ నవ్వులు పంచుకున్నారు.

Latestnews, Telugunews, get together programme, zphs school. . . 

షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది || The fire crew extinguished the shack fire due to the shot circuit

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో షాట్ సర్క్యూట్ ఏర్పడి గుడిసె దగ్ధం కావడం జరిగింది. లక్ష్మీ నరసింహులు గోసంగి సంఘ అధ్యక్షుడు వెంటనే స్పందించి,ఇంటిలోఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి కాపాడడం జరిగింది.వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా,ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది.ప్రభుత్వం వీరికి తగిన ఆర్థిక సాయం అందించాలని సంఘం అధ్యక్షులు, కాలనీ వాసులు కోరారు.

Latestnews, Telugunews, Telangannews, Kamareddynews…

కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఫ్రీ బస్ పథకంతో విద్యార్థులకు ఇబ్బందులు || Students are facing problems with free bus scheme under the ineffective rule of Congress

 

Nsnnews// కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండల గాంధీనగర్ గ్రామ విద్యార్థులు ఉదయం స్కూల్ కి వెళ్దమని బస్ స్టాప్ లో ప్రతి రోజు బస్ ల కోసం పడిగాపులుకాస్తున్నారు.బస్ లు ఆపకపోవడంతో పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు.ఈతంతు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది.తీవ్ర అసంతృప్తి తో నేడు రోడ్డెక్కి విద్యార్థులు నిరసన తెలిపారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం || We lost our minds and voted for Revanth Reddy

 

Nsnnews// రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. అన్ని ఇచ్చినా కేసీఆర్‌ను ఓడించి తప్పు చేసామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.

Lattestnews, Telugunews, Telangananews, Revanthreddy…

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు || RTC bus driver suffers heart attack

 

Nsnnews// ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. డ్రైవింగ్ సీటు పైకి దూకి అందరి ప్రాణాలు కాపాడిన కండక్టర్ బెంగుళూరులో నేలమంగళ నుండి దసనాపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో డ్రైవింగ్ సీట్ మీదే ప్రాణాలు విడిచిన బస్సు డ్రైవర్‌ కిరణ్ కుమార్. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీటు పైకి దూకి, బస్సును నియంత్రించి అందరి ప్రాణాలు కాపాడిన కండక్టర్ ఓబలేష్.

Latestnews, Telugunews, Bangalorenews…

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు || Organized blood donation camp for children on the occasion of CM Revanth Reddy’s birthday

 

Nsnnews// ఈనెల నవంబర్ 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సూర్య భాయ్ యూత్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ,చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్ లు సూర్య భాయ్ యూత్ యూవకులు భారీ ఎత్తున వచ్చి రక్తదానం చేయవలసిందిగా మీ చుట్టాలు ఉన్న వారికి కూడా తెలుపగలరని. ఎందుకంటే తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నరుల కోసం రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం సూర్య భాయ్ యూత్ యువకులు రక్తదానం చేయాలి. అని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి మీడియా సమావేశం లో తెలిపారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews..

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి-జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి || People should cooperate in comprehensive family survey-District Collector M. Manu Chowdhury

 

Nsnnews// రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సామజిక, విద్యా, ఉగ్యోగ, రాజకీయ మరియు కుల గణనలో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్వహించిన సర్వేను బుధవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేకు క్షేత్రస్థాయిలో ఏమైనా ఉన్నాయా అని సిబ్బందిని అడిగి సర్వే చేస్తున్న తీరును పరిశీలించి ఇంటి యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. ఈరోజు నుండి 8 తారీకు మూడు రోజులు హౌస్ సర్వే నిర్వహించి యజమానుల పేర్లను నమోదు చేసి ఇంటింటికీ స్టిక్కర్ అతికించడం జరుగుతుందని, 9వ తేదీ నుండి ప్రభుత్వం రూపొందించిన నిర్దిష్టమైన ఫారంలో ఇంటిలోని ప్రతి ఒక్కరి సమగ్ర సామాజిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ మరియు కులగణన నిర్వహించడం జరుగుతుందని ప్రజలు మీకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని అన్నారు. ఇంటింటి సర్వే చేసేందుకు జిల్లాలలో 2538 మంది ఎన్యూమరేటర్లను, 252 మంది సూపర్వైజర్లను నియమించడం జరిగిందని ఈ సర్వేను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీలు, నియోజకవర్గంలో స్థాయిలో ప్రత్యేక అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు మరియు జిల్లా ఓవరాల్ గా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఈనెలాఖరులోగా సర్వే పూర్తి చేసి ఏరోజుకారోజు సర్వే వివరాలను ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ తాసిల్దార్ వెంకట్ రెడ్డి, సర్వే సూపర్వైజర్, ఎన్యూమరేటర్ ఉన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Siddipetnews..

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ || Commissioner of Police Dr. B. Anuradha, IPS who visited Husnabad Police Stations

 

Nsnnews// ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారురోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించాలిఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేసి సమూలంగా నిర్మూలించాలి. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అధికారులు సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించాలి విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సిడి ఫైల్స్ తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని ఎస్ఐకి సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని రిసెప్షన్ సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని,అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల గురించి మరియు ప్రజలు ఎవ్వరూ సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ బుక్స్ తనిఖీ చేశారు, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే పర్యవసానాల గురించి గురించి స్కూల్ లలో కాలేజీలలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలు అమ్మే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలని తెలిపారు.
గ్రామాలలో మండల కేంద్రంలో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహించే వారిపై నిఘా పెంచాలని తెలిపారు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. నూతన చట్టాల గురించి గ్రామాలలో మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సిబ్బంది యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
స్కూళ్లు కాలేజీలు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో పనిచేయని సీసీ కెమెరాలు గురించి సంబంధిత వ్యాపారులు ప్రజాప్రతినిధులతో కలసి నేను సైతం ద్వారా రిపేర్ చేయించాలి, మరియు కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్టికల్ వారిగా విధులు నిర్వహించే సిబ్బంది గురించి అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు చేశారు ప్రతి సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ లో డాటా ను ఏ రోజు కా రోజు అప్డేట్ చేయాలని సూచించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా డిస్పోజల్ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో పోటీపడి విధులు నిర్వహించే వారికి ప్రతి నెల రివార్డులు అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలని తెలిపారు. పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక ఫిర్యాదురాలు దరఖాస్తు ఇవ్వగా ఏం జరిగింది ఎందుకు వచ్చారని వివరాలు కనుక్కొని ఆమె సమస్యను వెంటనే పరిష్కరించాలని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, సీఐ శ్రీనివాస్ కు సూచించారు*ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపి సతీష్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోర్టు లైజనింగ్ ఇన్స్పెక్టర్ కమలాకర్, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్, కోహెడ ఎస్ఐ అభిలాష్, సీసీ నితిన్ రెడ్డి, ఇరు పోలీస్స్టేషన్ల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, telanganews, Husnabadnews..

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అండగా నిలుస్తున్న కమలాకర్ రెడ్డి || Kamalakar Reddy standing in Dubbaka constituency of Siddipet district

 

Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో అనారోగ్యంతో ఆరేటి బాలయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి నిరుపేద కుటుంబం అయినా బాలయ్య కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే రైతు బీమా తో కుటుంబాన్ని ఆదుకున్నారని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబమైన బాలయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాజకిష్టయ్య మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి గుట్టం బైరయ్య దారా స్వామి దార మల్లయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Siddipetnews….

రామారెడ్డి మండలం పోసానిపేట్ పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్ ముగింపు || 68th State Cocoa Tournament concluded at Posanipet Parishad High School, Ramareddy Mandal

 

Nsnnews// కోకో టోర్నమెంటు ఫైనల్లో సాగిన ఉత్కంఠ భరితంగా అద్భుతంగా ఆడి మొదటి విజేతగా బహుమతిని కైవసం చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్ ముగింపు సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంధాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,డీఈఓ రాజు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడారు రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్లో విద్యార్థులు చాలా అద్భుతంగా రణించారని గెలుపు ఓటమి సహజమే అన్నారు. మొదటి విజేతగా ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకోవడం జరిగిందని. ద్వితీయ బహుమతి రంగారెడ్డి జిల్లా కైవసం చేసుకోవడం జరిగిందని,తృతీయ బహుమతి నిజామాబాద్ జిల్లా కైవాసం చేసుకోవడం జరిగిందని తెలిపారు, వారికి టోర్నమెంట్ కప్పులను మెమొంటోలను బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ రెడ్డి మాజీ గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, వివిధ జిల్లాల పిఈటిలు, గ్రామ వీడిసి సభ్యులు ఎంఈఓ ఆనందరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వివిధ సంఘాల నాయకులు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

Latestnews, telugunews, Telangananews, Kamareddynews….