Nsnnew// బైకులో పెట్రోల్ కు బదులు డీజిల్ పోస్తున్న వైనం పట్టించుకోని అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు ధర్మ కాంట ప్రక్కనగల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో కస్టమర్లకు పెట్రోల్ బదులు డీజిల్ పోసి బైకులను సర్వనాశనం చేస్తున్నారు. తూనికాల కొలతల అధికారులు తనకీలు లేకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కస్టమర్లకు పెట్రోల్ బదులు డీజిల్ పోసి మళ్లీ తీసేస్తామని చెప్పి , గంటల తరబడి పెట్రోల్ బంకులోనే ఉంచుతున్నారు, పెట్రోల్ బంక్ మేనేజర్ పర్వతం రమణ ను అడుగుతే కావాలని చేస్తారని బదులు చెప్తున్నారు. దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ బదులు బైకులలో డీజిల్ పోస్తున్న పోసి బైక్లను సర్వనాశనం చేస్తున్న బంకును సీజ్ చేయాలని కస్టమర్లు కోరుతున్నారు. అర్జెంటుగా పెట్రోల్ అవసరముందని కస్టమర్లు బంక్ కు వెళ్తే కస్టమర్లకు పెట్రోల్ కు బదులు డీజిల్ పోసి మళ్లీ తీసివేస్తామని చెప్పి గంటల తరబడి ఇబ్బంది పెడుతున్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును వెంటనే అధికారులు స్పందించి కస్టమర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలిసినవారు కస్టమర్ ఉంటే పర్వాలేదు కానీ తెలియని వారు కస్టమర్ ఉంటే ఎవరికి చెప్పుకుంటారు. అవగాహన లేని వ్యక్తులకు పెట్రోల్ డీజిల్ బంకులకు పర్మిషన్ ఇవ్వడంతో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
Latestnews, Telugunews, telangananews, Kamareddynews…