Nsnnews// ప్రకృతికే అందాన్ని తెచ్చే సాంప్రదాయ వేడుక బతుకమ్మఅని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ గౌరీమాత పూజ నిర్వహించి, బతుకమ్మ వేడుకలను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సంబరాల్లో పాల్గొన్న కలెక్టరేట్ మహిళ ఉద్యోగులు…బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతికి అందం తీసుకువచ్చే ఏకైక పూల పండగ బతుకమ్మ వేడుకలని పేర్కొన్నారు. మహిళ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతల ఒత్తిడిని మరిచి..ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని కలెక్టరేట్‌కు కొత్త శోభ తీసుకువచ్చారని కొనియాడారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ బతుకమ్, దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన ఉద్యానవన శాఖకు మొదటి , పంచాయతీ రాజ్ శాఖకు రెండవ, టీఎన్జీవో బృందానికి మూడవ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు దేవకీదేవి, సువర్ణ శారద, కవిత, అమీనా బేగంలతో పాటు…, కలెక్టరేట్ ఏఓ, పలు శాఖల అధికారులు, తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news