Home తెలంగాణ నిర్మాణాలకు అనుమతుల విషయంలో HMDA అనుసరిస్తున్న తీరును తప్పుబట్టిన హైకోర్టు || The High Court has faulted the HMDA’s approach regarding construction permits

నిర్మాణాలకు అనుమతుల విషయంలో HMDA అనుసరిస్తున్న తీరును తప్పుబట్టిన హైకోర్టు || The High Court has faulted the HMDA’s approach regarding construction permits

0

 

Nsnnews// నిర్మాణాలకు అనుమతుల విషయంలో HMDA అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన అన్నట్లుగా అనుమతుల మంజూరు ఉందని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ అమలు చేయకుండా.. కోడిగుడ్డుపై ఈకలు తీస్తున్నట్టు వ్యవహరిస్తోందని పేర్కొంది. దరఖాస్తును పరిశీలించి అనుమతులను మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై… అక్షయ డెవలపర్స్ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… సర్వీసు రోడ్డు లేదన్న కారణంగా అనుమతులు తిరస్కరించడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇదే ప్రాంతంలో గణపతి సచ్చితానంద అవధూత పీఠం ట్రస్ట్ కు అనుమతులు మంజూరు చేసిన HMDA..పిటిషనర్ విషయంలో తిరస్కరించిందన్నారు. అనుమతుల మంజూరుకు హైకోర్టు అదేశాలివ్వగా… HMDA అప్పీలు దాఖలు చేయగా కొట్టి వేసిందని, అయినా అనుమతులు ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి… HMDA తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ ఏ విద్యాధ్ లను ఆదేశిస్తూ ..విచారణను నవంబరు 15వ తేదీకి వాయిదా వేసింది.

latestnews, telugunews, telangananews, hyderabadnews, highcourt…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version