Nsnnews// కాంగ్రెస్ సర్కార్ అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జీవో 29 రద్దుచేసి గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తున్న పరిస్థితుల్లో… మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయకుంటే కాంగ్రెస్ ను ఆశీర్వదించిన రైతులే…స్థానిక సంస్థల ఎన్నికల్లో భరతం పడతారని ఈటల హెచ్చరించారు.
Latestnews, Telugunews, Congress Government, BJP, Etala Rajendhar..